కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నాందేవ్ వాడ దుబ్బ మున్నూరు కాపు సంఘంలో ఉపనగర్ రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన యువ సమ్మేళన (RSS Youth Gathering) కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా VHP కార్యాలయంలో గోడ ప్రతికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ శారీరిక్ ప్రముక్ జ్యోతి భద్రయ్య, నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్య వెంకటేష్, యువ సమ్మేళన సంయోజక్ శ్రావణ్, వెంకటేష్, ఉపనగర కార్యవాహ ఆదె నవీన్, స్వయం సేవకులు మధుకర్, నవీన్, సుధీర్, శ్రావణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

