మన్మోహన్ సింగ్ ఒక్క తప్పు చేయలేదు: సోనియా గాంధీ

కలం, వెబ్ డెస్క్: దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన పాలనలో ఒక్క తప్పు కూడా చేయలేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) కొనియాడారు. చరిత్ర ఎప్పటికీ ఆయన పట్ల దయతోనే ఉంటుందన్నారు. మన్మోహన్ సింగ్ నిజాయితీకి నిలువుటద్దం లాంటి వారని, ఆయన పాలనలో జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సంస్కరణలో దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయనపై నమోదైన బొగ్గు కుంభకోణం కేసును ఇటీవలే సుప్రీం కోర్ట్ పూర్తిగా కొట్టేసిన నేపథ్యంలో సోనియా గాంధీ స్పందించారు. మన్మోహన్ సేవలను ఇప్పుడు దేశ ప్రజలు గుర్తిస్తున్నారని వివరించారు.

ఎన్నో గొప్ప చట్టాలు..

మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకొచ్చిన గొప్ప చట్టాలు దేశ గతినే మార్చివేశాయని సోనియా గాంధీ ప్రశంసించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనవి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు.. ఇవి దేశంలో సామాజిక విప్లవానికి పునాది వేశాయని గుర్తు చేశారు. ఉపాధి హామీ చట్టం కొవిడ్ సమయంలో అత్యంత బలహీనవర్గాలకు ఎంతలా చేరువైందో వివరించారు.

మోదీ హయాంలో దుర్వినియోగం..

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆశయాలకు పూర్తి భిన్నంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సోనియా గాంధీ మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అసలు పని వదిలేసి, ప్రతిపక్షాలను వేధించే సంస్థలుగా మార్చేశారని విమర్శించారు. యూపీఏ హయాంలో జీడీపీ పైపైకి వెళ్లిందని, గత 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో జీడీపీ నేల చూపులు చూసిందన్నారు. పేదలు భారీగా పెరిగిపోతుండటం అత్యంత ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>