తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తనిఖీలు షురూ!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 307 అకడమిక్ ప్యానెల్ టీమ్స్‌ను విద్యా శాఖ ఏర్పాటు చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టబోతున్నాయి. విద్యార్థులకు బోధన, హాజరు ఎలా ఉంది, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన పథకం అమలు ఎలా ఉందనే అంశాలపై వివరాలు సేకరించబోతున్నాయి. ఈ నివేదికలను డీఈవోల ద్వారా రాష్ట్ర విద్యా శాఖకు సమర్పించబోతున్నారు. ఇందులో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

సీఎం రేవంత్ ఆదేశాలతో..

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తనిఖీల కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. పాఠశాలలకు సరిపడా నిధులు మంజూరు చేస్తున్నా విద్యా నాణ్యతలు, సౌకర్యాలు పెరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెగ్యులర్ అధికారులు కాకుండా, ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయాలని సూచించారు. ఒక్కో అంశాన్ని తీసుకుని.. అందులో లోపాలు ఏంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విద్యా శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>