సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

కలం, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ సిప్లిగంజ్ తో సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడంతో పాటు ఈ వ్యవహారంలో రాహుల్ సప్లిగంజ్ తో సహా కొందరు జర్నలిస్టులతో పాటు మరికొందరు ప్రమోయం ఉందని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎండాడలోని మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>