కలం, వెబ్ డెస్క్ : కొలంబియాను భారీ భూకంపం (Colombia Earthquake) వణికించింది. సోమవారం సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైంది. కొలంబియాలోని పశ్చిమ ప్రాంతంలో, శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలోని చోకో ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం భూమికి 107 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
భూకంపం ధాటికి కొలంబియాలోని పలు నగరాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. పెరీరా, కాలీ, క్విబ్డో, మానిజలెస్ ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 132 మందికి పైగా మృతి చెందగా, 87 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూకంపం ప్రభావం కొలంబియాకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న వెనెజువెలా, ఈక్వడార్, పనామా దేశాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తర్వాత పలు స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు.
A 7.4-MAGNITUDE EARTHQUAKE HAS LEFT #COLOMBIA DEVASTATED
At least 111 people have been killed and 1,600+ buildings damaged after the quake struck near #SanJosédelPalmar in the remote Chocó region.
The tremors were felt hundreds of kilometres away, including in #Bogotá and… pic.twitter.com/9Vu0RX6zJN
— Rizwan Ashraffi (@rizwanace) August 11, 2026

