బాధిత కుటుంబానికి నిరంజన్‌రెడ్డి పరామర్శ

కలం, వనపర్తి: వనపర్తి జిల్లాలోని కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్‌ మియా ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) సోమవారం పెబ్బేరు పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు పొందాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ పరామర్శలో మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్ కర్రె స్వామి, విశ్వరూపం, రాజశేఖర్‌, సాయినాథ్‌, ఎల్లారెడ్డి, వడ్డె రమేష్‌, సాయిరెడ్డి, సంబు రాము, వేణు, మూర్తి, అఖిల్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>