ఉద్యమకారులకు ‘సైనిక సన్మాన్’ పింఛన్ ఇవ్వాలి: ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్

కలం, కరీంనగర్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఉద్యమ కారులకు సైనిక సన్మాన్ తరహాలో పెన్షన్ ప్రకటించాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ (Karimnagar) లో పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన ఉద్యమ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ.. 1969 నుంచి 2013వరకు జరిగిన 45 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అహర్నిశలు శ్రమించి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమ కారులను గౌరవించుకోవాలన్నారు.

లాటీల దెబ్బలు తిని చీకటి జైలు జీవితం గడిపిన ఉద్యమ కారుల బ్రతుకులు చిన్నా భిన్నమైనయాని గుర్తు చేశారు. ఉద్యమ కారులను తక్షణమే గుర్తించి ఉద్యమ కారులకు సైనిక్ సల్మాన్ పెన్షన్ తరహాలో నెలకు 12 వేల పెన్షన్, రైలు, బస్సుల లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యమ కారుల కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ వైద్య సౌకర్యం అందించాలని, కుటుంబం లో ఒక్కరికి వయోపరిమితి లేకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 200 గజాల ఇంటి స్థలం లో ప్రభుత్వమే నేరుగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

క్రియా శీలకంగా పాల్గొన్న ఉద్యమ కారులకు ప్రభుత్వ రంగ సంస్థల లో నామినేటెడ్ పదవులలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రం లో ఆగస్టు 15న రాష్ట్ర, జిల్లాల ఉద్యమ కారుల తో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ఉద్యమ కారులు కొత్తకొండ రవీందర్ రావు, శ్రీపాద సత్యనారాయణ, దేవుళ్ళపల్లి రామూర్తి,బోయినపల్లి శ్రీనివాస్ రావు పెంచాల రంగయ్య, జన్ను జయరాజ్, రమణా రెడ్డి, తదితర రాష్ట్ర జిల్లాల ఉద్యమ కారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>