వనపర్తి జిల్లాలో అయిదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కలం, వనపర్తి: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న అయిదు ట్రాక్టర్లను వనపర్తి జిల్లా పెద్దమందడి (Peddamandadi) మండల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి చిలకటోనిపల్లి గ్రామ శివారులోని వాగు నుంచి కనిమెట్ట గ్రామానికి చెందిన అయిదుగురు ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుక తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జలంధర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతులు పొందిన తరువాత ఇసుక రవాణా చేసుకోవాలని, లేకపోతే చట్ట ప్రకారం సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి, ట్రాక్టర్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>