కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పార్లమెంట్‌కు రావాలంటేనే భయపడుతున్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. గత 15 రోజులుగా డిమాండ్ చేస్తున్నా.. వారు మాత్రం స్పందించడం లేదన్నారు. అమిత్ షా అద్భుతమైన ప్రసంగం వినడానికి సభకు రమ్మనడం లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై కాల్పులు జరిపేందుకు ఎవరు అనుమతించారో చెప్పాలన్నారు.
అమిత్ షా స్వయంగా ఆదేశాలిచ్చారా..? లేదా హోం మంత్రిత్వ శాఖలో మరెవరైనా ఈ పని చేశారా..? అనేది దేశానికి చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మరెవరైనా కాల్పులు జరపమని చెప్పి ఉంటే.. షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.
విద్యార్థులపై కఠినంగా ఉండొద్దు..
జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నవారిపై ఎలాంటి కఠిన చర్యలనైనా తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అలా జరిగి ఉంటే ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులపై పోలీస్ బల ప్రయోగాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమన్నారు. శాంతియుత నిరసనలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్యామ్యం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం తీరును రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పుబట్టడం గమనార్హం.
Also Read : రైతులకు ప్రతి నెలా రూ.5 వేల కోట్లు: మంత్రి పొంగులేటి
Follow Us On : WhatsApp

