‘నరేంద్ర’ పేరుపై పాక్ బాక్సర్ ఏడుపు.. మోదీ నవ్వులు!

కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ 2026 విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన నివాసంలో సరదాగా ముచ్చటించారు. గ్లాస్గోలో మెడల్స్ సాధించిన భారత అథ్లెట్లను ఆయన అభినందించారు. ఈ భేటీలో బాక్సర్లు చెప్పిన ఆసక్తికర విషయాలు నవ్వులు పూయించాయి. 2015 ప్రపంచ మిలిటరీ గేమ్స్‌లో పాకిస్థాన్ బాక్సర్‌ను ఓడించిన ఘట్టాన్ని హెవీవెయిట్ బాక్సర్ నరేందర్ బెర్వాల్ గుర్తుచేసుకున్నారు. తన పేరు, తన కోచ్ పేరు, చివరికి భారత ప్రధాని పేరు కూడా నరేంద్ర కావడంతో తనకు ఆ పేరుపైనే ద్వేషం వచ్చిందని ఆ పాక్ బాక్సర్ అన్నాడని బెర్వాల్ చెప్పారు. ఈ విషయం వినగానే ప్రధాని మోదీ నవ్వేశారు. బెర్వాల్ గ్లాస్గో గేమ్స్‌లో 90 ప్లస్ కేజీల విభాగంలో రజతం సాధించారు.

మరొక బాక్సర్ జాడుమణి సింగ్ (Jadumani Singh) కార్గిల్ విజయ్ దివస్ రోజున పాక్ బాక్సర్ సుమామా రెహ్మాన్‌ను 5-0తో ఓడించిన క్షణాన్ని పంచుకున్నారు. సైన్యంలో పనిచేస్తున్న తనకు ఆ రోజే పాక్‌పై గెలవడం చాలా ప్రత్యేకమని జాడుమణి అన్నారు. ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం ఇవ్వడాన్ని మోదీ (PM Modi) ఎంతో అభినందించారు. ఈసారి భారత బాక్సింగ్ దళం 7 స్వర్ణాలు, 3 రజతాలతో రికార్డు స్థాయిలో 10 పతకాలు సాధించింది. మొత్తం మీద భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు సభలో 2030 ఎడిషన్ నిర్వహణ బాధ్యతలను అహ్మదాబాద్‌కు అప్పగించారు.

Also Read : బ్రిజ్‌భూషణ్‌కు విముక్తి.. తర్వాత అసలు ట్విస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>