కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రయాణికుల వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు కాగా, వారి కోసం వెతుకుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : చెరువులోనే బతుకుతున్న బాలుడు.. బెంగాల్‌లో విచిత్ర ఘటన, వీడియో వైరల్!
Follow Us On: Instagram

