‘గోవింద’ నామాలను అపహాస్యం చేస్తే ఊరుకోం: పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా ఉపయోగించి అపహాస్యం చేయడాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖండించారు. నెల్లూరు నగరంలో వైసీపీ నిర్వహించిన మెగా డీఎస్సీ దీక్షలో పవిత్రమైన ‘గోవింద’ నామాలను రాజకీయ విమర్శలకు పేరడీగా ఉపయోగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను కించపరిచేలా ఉండటంతో పాటు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలను రాజకీయ ప్రయోజనాల కోసం లేదా అపహాస్యం చేసే విధంగా ఉపయోగించకూడదని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూచించారు. అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, కుట్రపూరిత ఆలోచనలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సదరు వైసీపీ నేతలపై చర్యలు ఉంటాయని వెల్లడించారు.

Also Read : ‘నరేంద్ర’ పేరుపై పాక్ బాక్సర్ ఏడుపు.. మోదీ నవ్వులు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>