కలం, వెబ్ డెస్క్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Ponguleti vs Kaushik Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. మండలంలోని గూడురు, మరిపల్లిగూడెం, కమలాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి హాజరయ్యారు.
అనంతరం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తున్నామని చెప్పారు.
దీంతో వెంటనే స్పందించిన కౌశిక్ రెడ్డి ఈ సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సభలో జై కాంగ్రెస్, జై కేసీఆర్ నినాదాలతో మార్మోగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read : ‘నరేంద్ర’ పేరుపై పాక్ బాక్సర్ ఏడుపు.. మోదీ నవ్వులు!
Follow Us On : WhatsApp

