ట్రిబ్యూన‌ల్స్ రీఫార్మ్స్‌ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

క‌లం, వెబ్‌డెస్క్‌: ట్రిబ్యూన‌ల్స్ సంస్క‌ర‌ణ‌ల బిల్లు (Tribunals Reforms Bill)కు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం ల‌భించింది. విపక్షాల ఆందోళనల మధ్యే స్పీక‌ర్ బిల్లును ఆమోదించారు. అనంత‌రం లోక్‌సభను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు.

ట్రిబ్యున‌ల్ వ్య‌వ‌స్థ‌లో స్వతంత్ర‌త‌, ఏక‌రూప‌త‌ను పెంచే ల‌క్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ట్రిబ్యునళ్ల నియామకాలను పర్యవేక్షించడంతో పాటు ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ట్రిబ్యునల్ చైర్‌పర్సన్లు, సభ్యుల అర్హతలు, పదవీకాలం, సేవా నిబంధనలను ఈ బిల్లు ద్వారా నిర్ణ‌యిస్తారు. చైర్‌పర్సన్లు, సభ్యులకు ఐదేళ్ల పదవీకాలాన్ని ప్రతిపాదించడంతో పాటు నిర్దిష్ట వయోపరిమితుల్లో కూడా కీల‌క మార్పుల‌ను బిల్లులో సూచించారు.

Also Read : పటాన్‌చెరు ఆసుపత్రిలో కరెంట్ కష్టాలు.. మొబైల్ టార్చ్ వెలుగులోనే వైద్యం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>