సూపర్ స్పీడ్‌తో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుంది: సీఎం

కలం, వెబ్ డెస్క్: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలు (Pattadar Passbook) అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

రాష్ట్ర అభివృద్దే ధ్యేయం..

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పరిపాలనా సంస్కరణలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం (CM Chandrababu) స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ఏకైక అజెండా అని తెలిపారు.ప్రజలకు మెరుగైన పాలన అందించడం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

హామీల అమలు దిశగా కృషి..

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోందని సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆనాడే ప్రజలకు హామీ ఇచ్చామని.. ఆ దిశగా ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్ స్పీడ్‌ తో ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోరాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని చెప్పారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో మౌలిక వసతులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామన్నారు.

Also Read : పెద్ది సంస్మరణ సభలో కేటీఆర్ ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>