పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పర్యటన సాగుతోంది. ఈ మేరకు కలిదిండిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు(Mee Bhoomi Mee Hakku)’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీ-సర్వే పూర్తయిన గ్రామాలకు చెందిన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22A కింద ఉన్న 41 వేల ఎకరాలకు విముక్తి కల్పించామని అన్నారు. 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ‘మీ భూమి, మీ హక్కు.. మీ పట్టాదారు పాస్‌బుక్‌పై వేరేవాళ్ల ఫొటోలు అవసరం లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీపై విమర్శలు..

స్వాతంత్య్రం రాకముందు నుంచి ఉన్న సమస్యలను సాధించాలని సీఎం (CM Chandrababu) స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే 151 సీట్లు అన్నవారి సంగతి ఏమైందో చూశామని వైసీపీ పార్టీని ఉద్దేశించి సెటైర్లు వేశారు. తాను బటన్లు నొక్కచ్చు.. పరదాలు చాటున రావొచ్చు కానీ ప్రజల సమస్యలు పరిష్కారం ఆవుతాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 గ్రామాల్లో 30 లక్షలకు పైగా పాస్ పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. ఇంకా 9365 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాపరింగ్ చేయకుండా చేశామని అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలూ ప్రింట్ చేశామని అన్నారు.

భూమిపై తమ హక్కును అధికారికంగా మరింత పటిష్ఠం చేసే ప్రక్రియలో భాగంగా ఈ పాస్ పుస్తకాలను అందజేశారు. భూ హక్కులకు భరోసా కల్పించడంతో పాటు భూముల వివరాల్లో పారదర్శకత, రైతులకు భూ వివాదాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పాస్ పుస్తకాలు అందజేస్తోంది. రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలుసుకునేనా పట్టాదారు పాసు పుస్తకంలో వివరాలు పొందుపరిచారు. అలాగే వారసత్వ బదలాయింపులు, రుణాలు, ఇతర అవసరాల సమయంలో రికార్డుల పరంగా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది.

Also Read : సూపర్ స్పీడ్‌తో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుంది: సీఎం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>