కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చి ఓ ఆర్మీ జవాన్ (Army Jawan) మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. హైదర్షాకోట్లో ఓ వ్యక్తి సోమవారం ఉదయం అతి వేగంగా కార్ డ్రైవ్ చేశాడు. రాంగ్ రూట్లో వస్తూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న జవాన్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత రెండు బైక్‌లను కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోప్ఓయాడు.
బైక్‌లపై వెళ్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్నవాళ్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. నార్సింగి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తి, అందులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నారా? అతి వేగమే ప్రమాదానికి ముఖ్య కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

