బాసరలో ఘనంగా ఊర పండుగ.. గ్రామ సుభిక్షం కోసం పూజలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా బాసర మండల కేంద్రంలో ఆదివారం ఊర పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలంతా ఐక్యంగా ఊరేగింపుగా తరలివెళ్లి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊర పండుగ సందర్భంగా గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని గ్రామస్తులు గ్రామ దేవతలను మొక్కుకున్నారు.

పంటలు సమృద్ధిగా పండితే రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గతంలో 2020లో ఊర పండుగ నిర్వహించామని, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>