కలం, వెబ్‌డెస్క్: నగరంలో బోనాల (Bonalu) వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో ఆనంద్ దేవరకొండ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. విజయ్ దేవరకొండను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. భద్రకాళి ప్రొడక్షన్ పేరు మీద పూజ చేయించినట్లు తెలిపారు.

