నిర్మ‌ల్‌లో ఆర్ఎస్ఎస్ యువ స‌మ్మేళ‌నం.. ఎప్పుడంటే?

క‌లం, నిర్మ‌ల్‌: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతవసంతాల సందర్భంగా ఈ నెల 13న నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న హిందూ యువ సమ్మేళనాన్ని (Hindu Yuva Sammelan) విజయవంతం చేయాలని నగర సంఘచాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం హిందూ యువ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి, ధర్మరక్షణ, కర్తవ్యనిష్ఠ, సామాజిక సేవా భావం, జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే సమ్మేళనం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

స్థానిక భవానీనగర్‌ లోని డీమార్ట్ ఎదురుగా ఉన్న ఎంకే కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 13న గురువారం సాయంత్రం 5:30 గంటలకు సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన్ కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. హిందూ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ కిన్నెర్ల రవి, సాయికృష్ణ, వివేక్, ప్రశాంత్, శివ, హరీష్, సుదర్శన్, నరేందర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>