వరంగల్‌లో డీజీపీ సీవీ ఆనంద్‌కు ఘన స్వాగతం

కలం, హనుమకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పూల మొక్కను అందజేసి డీజీపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం జనగామ జిల్లా కలెక్టర్‌తో పాటు టీజీ ఎన్‌పీడీసీఎల్ చైర్మన్, పోలీస్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కూడా డీజీపీ మొక్కలను అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు శాఖ పనితీరు, శాంతిభద్రతలు, ఇతర అంశాలపై డీజీపీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>