కలం, వెబ్ డెస్క్ : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా సూసైడ్ నోట్, కీలక ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్న ఐఫోన్ మాయమైనట్లు సమాచారం.
కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ప్రశ్నించగా, తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాసినట్లు వెల్లడించినట్లు తెలిసింది. సూసైడ్ నోట్‌పై సీపీ సజ్జనార్ ప్రశ్నించగా, ప్రస్తుతం ఆ నోట్ ఎక్కడ ఉందో తనకు తెలియదని ఉదయ్ చెప్పినట్లు సమాచారం.
సూసైడ్ నోట్ ఆచూకీతో పాటు ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్న ఐఫోన్ మాయం కావడం కేసులో మరింత ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ రెండు అంశాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Also Read : క్షుద్రపూజల వివాదం.. రేవంత్ కి కేటీఆర్ కౌంటర్
Follow Us On: Instagram

