కలం, వెబ్ డెస్క్ : భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ (CM Dhami) సానుకూలంగా స్పందించారు. పంత్ అభ్యర్థనకు మద్దతుగా నిలుస్తూ ఆయనను రాష్ట్రంలోకి ఆహ్వానించారు.
రిషభ్ పంత్ తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌తో పాటు ఉత్తరాఖండ్ పేరును నిలబెట్టారని సీఎం కొనియాడారు. పంత్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయమై అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
Follow Us On: Sharechat

