కలం, వెబ్ డెస్క్ : భారతదేశం అనేక రంగాల్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోందని, దేశం యువత వైపు ఎంతో బాధ్యత, అపారమైన అంచనాలతో చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) 57వ పట్టభద్రుల ఉత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్రిటికల్ మినరల్స్, లోతైన సముద్ర అన్వేషణ, బ్యాటరీలు, విద్యుత్ నిల్వ, ఇంధన భద్రత, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాలు యువత ప్రతిభ, ఆవిష్కరణలు, నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా తాము కూడా వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.
పరిశోధన రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. నేడు దేశానికి నూతన పరిశోధనలు ఎంతో అవసరమని, ప్రభుత్వం కూడా పరిశోధనల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. యువ ప్రతిభావంతులు పరిశోధనలు సాగించడానికి, తమ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎంతగానో తోడ్పడుతోందని వివరించారు.
Also Read : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా స్వామి యాదవ్
Follow Us On : WhatsApp

