కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జాతీయ రహదారి పనులు (Mahbubnagar Highway) యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న వర్షపు నీటి కాల్వ పనులు, జాతీయ రహదారి పనులు, కల్వర్టు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతను సమీక్షించి, సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులను పనులను వేగవంతం చేసి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
అన్ని సంబంధిత శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని, ముఖ్యంగా పనులు జరుగుతున్న సమయంలో సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేదా సమస్యలు కలగకుండా ఉండేందుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాణ్యత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
బాలానగర్‌లోనూ తనిఖీలు..
అటు బాలానగర్‌లో జరుగుతున్న నేషనల్ హైవే అథారిటీ ఆప్ ఇండియా (NHAI) ఫ్లైఓవర్ నిర్మాణం, సర్వీస్ రోడ్ల నిర్మాణం పనులను, అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణ కార్యకలాపాల ప్రస్తుత స్థితిని అంచనా వేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు రాజీ పడకుండా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.
నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా రాజీ పడకుండా, కొత్త ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని ఆయన సంబంధిత NHAI అధికారులు, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. అలాగే, పనుల నిర్వహణ సమయంలో సంబంధిత శాఖల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూడాలని, ఆమోదించబడిన నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నాణ్యత, భద్రత మరియు సరైన ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని ఆయన చెప్పారు.
Also Read : ‘పెద్ది’ కుటుంబానికి కేసీఆర్ భారీ ఆర్థిక సాయం
Follow Us On: Sharechat

