కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో దొంగతనాలు, గంజాయి విక్రయాలు, హత్యలు, అక్రమ ఇసుక తవ్వకాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు (Nirmal BJP), పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కొంతకాలంగా హిందూ దేవాలయాలు, పూజా సామగ్రి దుకాణాలు, గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లాలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని, గంజాయి సరఫరా విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టర్లు వేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

