కలం, నిర్మల్: నిర్మల్ ( Nirmal) జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్ పేట్ మహాలక్ష్మి అమ్మవారికి పట్టణానికి చెందిన వైద్యులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం కొత్త కుండలో బోనం తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రతి ఏడాది మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ వస్తోందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ నాలం శశికాంత్, డాక్టర్ స్వప్న దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు.

