రామాయంపేటలో ముగ్గురు బాలురు అదృశ్యం

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా రామాయంపేట (Ramayampet) పట్టణంలో ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ​రామాయంపేటలోని కేసీఆర్ కాలనీకి చెందిన ధనుష్, మనోజ్, షేక్ సమీర్ అనే ముగ్గురు బాలురు గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వీరి వయసు 13 సంవత్సరాలు కాగా, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ​

గురువారం రాత్రి 9 గంటల వరకు కాలనీలోనే ఆడుకున్న ఈ బాలురు, ఆ తర్వాత ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో బంధువులు రామాయంపేట పోలీసు స్టేషన్‌(Ramayampet PS)లో ఫిర్యాదు చేశారు. ​కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ బాలుర కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Also Read : మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటారా?.. విద్యార్థినుల ఆందోళన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>