కలం, వెబ్ డెస్క్: ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థినులు నిరసన (Students Protest) వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే.. విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటే ఇంకా తమను కంపెనీలు ఏ విధంగా తీసుకుంటాయని ప్రశ్నించారు. కంపెనీలు ఇక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని మండిపడ్డారు. తమకు ఉద్యోగవకాశాలు ఎలా లభిస్తాయని, భవిష్యత్తు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఇంజినీరింగ్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించి, క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థినుల ఆందోళనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే!..
-ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థినులు నిరసన
-వెంటనే ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఇంజినీరింగ్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Engineering Students Protest… pic.twitter.com/qvLI2oaUdn— Kalam Daily (@kalamtelugu) August 7, 2026
Also Read : ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
Follow Us On : WhatsApp

