బోనమెత్తిన మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాల

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలు ప్రతిఒక్కరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల నుంచి విద్యార్థులు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు.

విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ, ఉపాధ్యాయులు హేమలత, సంతోశ్, రాజేందర్, శ్రీనివాస్, మసియుద్దీన్, విద్యారాణి, సత్తయ్య, సునీత, ముత్తన్న, రాజ్‌ కుమార్ పాల్గొన్నారు.

Also Read : మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటారా?.. విద్యార్థినుల ఆందోళన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>