కలం, వెబ్డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కనబడటం లేదంటూ పార్లమెంట్ (Parliament) వద్ద ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగాయి. అమిత్ షా పార్లమెంట్ రావాలని కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నేడు పార్లమెంట్ ఉభయ సభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్, అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద నిరసనకు దిగారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన సమయంలో పోలీసులు తీసుకున్న చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరుతూ లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని తన నోటీసులో పేర్కొన్నారు.

