తెరిచి ఉన్న బోరు.. చిన్నారుల ప్రాణాలకు ముప్పు!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని ఓల్డ్ డీఎస్పీ ఆఫీస్ రోడ్డు, సరస్వతి కాలనీ, మర్రికుంట ప్రాంతంలో ఇండ్ల మధ్యలో బహిరంగంగా వదిలేసిన బోరు (Open Borewell) స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బోరుకు రక్షణ చర్యలు లేకపోవడంతో చిన్నారులు దాని వద్దకు వెళ్లి రాళ్లు వేస్తూ ఆడుకుంటుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెరిచి ఉన్న బోర్లలో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా అలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు, బోరు యజమాని స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

నీరు పడని బోర్లను యథేచ్ఛగా వదిలేయకుండా సంబంధిత యజమానులు వెంటనే మూసివేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారులతో పాటు నోరులేని జీవాలు జంతువులు, పక్షులు కూడా ప్రమాదవశాత్తు బోరులో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు చర్యలు తీసుకుంటేనే ప్రాణనష్టం నివారించవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే ఎక్కడైన వదిలేసిన బోరులు ఉన్నాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించి ముందస్తు చర్యగా వాటిని గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే బోరులను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>