చదువు ఆపేసినవారికి ‘టాస్‌’తో అవకాశం: జగిత్యాల కలెక్టర్

కలం, జగిత్యాల: చదువుకు దూరమైన వారు తిరిగి కొనసాగించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) గొప్ప అవకాశం కల్పిస్తోందని జగిత్యాల (Jagtial) జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో టాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరపత్రికలను జిల్లా విద్యాధికారి రాములు, టాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ రామడుగు రవీందర్‌తో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలోనే వివిధ కారణాలతో చదువు ఆపేసిన వారు మళ్లీ చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాధికారి రాములు మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తమ గ్రామాల్లో చదువు మధ్యలో ఆపేసినవారిని గుర్తించి తిరిగి చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు. బుగ్గారం శ్రీ గ్లోబల్ స్కూల్ అధినేత డాక్టర్ నక్కరాజు, సిరిపురం రాజేందర్, గడ్డం రమేష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>