జయశంకర్ సార్‌కు కరీంనగర్‌లో టీఎన్జీవోల నివాళి

కలం, కరీంనగర్: ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీవో కమ్యూనిటీ హాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేయడంతో పాటు ఉద్యోగుల స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గర్ల్స్ కాలేజీ సమీపంలోని అనాథ చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఉద్యోగుల ఐక్యత మరింత బలోపేతం..

దారం శ్రీనివాస్ రెడ్డి (Daram Srinivas Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఆచరణలో కొనసాగిస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి మారం జగదీశ్వర్ నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. ఉద్యోగుల ఐక్యత మరింత బలోపేతం కావాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా ప్రధాన కార్యదర్శి సంగేం లక్ష్మణరావు స్వయంగా రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, ఎడ్ల అరవింద్ రెడ్డి, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, గంగారపు రమేష్, హర్మీందర్ సింగ్, ప్రభాకర్ రెడ్డి మారుపాక రాజేష్ భరద్వాజ్, శ్రీమాన్ రెడ్డి, పోలు కిషన్, నాగరాజు, శారద, సునీత, సరిత, సుస్మిత, శైలజ పాల్గొన్నారు. అలాగే, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, ప్రధాన కార్యదర్శి శంకర్, మర్రి శ్రీనివాస్, పెండ్యాల కేశవరెడ్డి, లింగయ్య, పూర్ణచందర్ రెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు, గిరిధర్ రావు, లవ కుమార్, కరుణాకర్, కమలాకర్, శశిధర్, నారాయణ, సాయి, రాజేష్, జీవన్, బైరి శ్రీనివాస్ విజయ్ పాల్గొన్నారు.

Also Read : పంట మార్పిడి విధానాలు పాటించాలి.. రైతులకు కోదండ రెడ్డి పిలుపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>