దిగ్వాల్ వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టివేత!

కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా కోహీర్ (Kohir) మండలం దిగ్వాల్ వద్ద పోలీసులు భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు లారీలో అక్రమంగా రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో కోహీర్ పోలీసులు అప్రమత్తమై దాడి చేశారు. లారీని అడ్డుకుని తనిఖీలు చేపట్టగా అందులో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు, వాటిని తక్షణమే దిగ్వాల్‌లోని పౌరసరఫరాల శాఖ గోదాంకు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>