బిజెవైఎం నిరసనపై వాటర్ కెనన్ల ప్రయోగం!

కలం, వెబ్‌ డెస్క్‌ : తిరువనంతపురం (Thiruvananthapuram) సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM ) ఆధ్వర్యంలో కార్యకర్తలు సెక్రటేరియట్ దిశగా భారీ మార్చ్ నిర్వహించారు.

ఆందోళనకారులు పోలీసుల బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

అర్హులైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, అక్రమ నియామకాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని బిజెవైఎమ్ డిమాండ్ చేసింది. నిరసన తీవ్రం కావడంతో పోలీసులు పలువురు నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>