ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.. నిర్మల్ BJYM డిమాండ్

కలం, నిర్మల్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం (Nirmal BJYM) డిమాండ్ చేసింది. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సూరజ్ నాయక్, నాయకులు సాత్విక్, కందుల హరీశ్, వెంకటేశ్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు పాల్గొన్నారు.

Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>