‘ఆ వార్తలు ఫేక్’.. చిరంజీవి టీమ్ అధికారిక ప్రకటన

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ (Chiranjeevi Team) స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రచారంలో ఉన్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.

ఇలాంటి నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అలాగే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదా మరింతగా ప్రచారం చేయడం మానుకోవాలని చిరూ టీం అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇటీవలి కాలంలో ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వాస్తవ పరిస్థితిని తెలియజేసేందుకు ఈ స్పష్టీకరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభిమానులు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని చిరంజీవి టీమ్ మరోసారి సూచించింది.

Also Read : మ‌హేశ్ బ‌ర్త్‌డేకు స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రాజ‌మౌళి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>