కలం, నిర్మల్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (Prof Jayashankar) జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ (Prof Jayashankar) అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ఏఓ యూసఫ్ అలీ, మల్లారెడ్డి, సీఐలు కృష్ణ, సత్యనారాయణ, సమ్మయ్య, మల్లేష్, ఆర్‌ఐలు రామకృష్ణ, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ‘క్యా బోల్తీ పబ్లిక్’.. సీజేపీ కొత్త క్యాంపెయిన్ ప్రకటన
Follow Us On : WhatsApp

