మ‌హేశ్ బ‌ర్త్‌డేకు స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రాజ‌మౌళి!

క‌లం, వెబ్‌డెస్క్‌: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి (Rajamouli) బిగ్ స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశార‌ని టాలీవుడ్‌లో టాక్ న‌డుస్తోంది. రాజ‌మౌళి డైరెక్ష‌న్ మ‌హేశ్ బాబు హీరోగా వార‌ణాసి (Varanasi) అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న ప్రియాంకా చోప్రా న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సాధార‌ణంగా సెల‌బ్రెటీల పుట్టిన రోజులు జ‌రిగితే వాళ్లు న‌టిస్తున్న సినిమా నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటారు.

ఇక వార‌ణాసికి ఇప్ప‌టికే ఫుల్ హైప్ క్రియేట్ అయిపోయింది. ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్‌డేట్ వ‌చ్చినా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయిపోతోంది. ఇక మ‌హేశ్ బ‌ర్త్‌డేకు ఫ్యాన్స్ అంద‌రికీ స‌ర్‌ప్రైజ్ ఇస్తూ మ‌హేశ్ బాబు రాముడి గెట‌ప్‌లో ఉన్న ఫోటోను విడుద‌ల చేయాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేశాడ‌ని తెలుస్తోంది. ఈ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నా.. దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. మ‌రి జ‌క్క‌న్న మ‌హేశ్ ఫ్యాన్స్‌కి ఎలాంటి ట్రీట్ ఇస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>