కలం, వెబ్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) లో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం తెల్లవారుజామున 5.45 గంటలకు అప్పర సియాంగ్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పాంగిన్‌కు 116 కి. మీటర్ల దూరంలో, 11 కి.మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.1గా నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది.

