కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని జైసల్మేర్ (Jaisalmer) జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మిలటరీ ఫైరింగ్ రేంజ్‌లోకి పుట్టగొడుగులు ఏరేందుకు వెళ్లిన ఒక రైతు ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి పరిసరాల్లో లభించిన ఒక ఇనుప స్క్రాప్ ముక్కను పగలగొట్టేందుకు అతను ప్రయత్నించాడు. ఆ సమయంలో అది ఒక్కసారిగా తీవ్ర శబ్దంతో పేలిపోయింది. దీంతో సదరు రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు సమాచారం అందుకున్న సైనిక అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

