కలం, జనగామ: భారీ కొండ చిలువ ఓ మహిళపై దాడి (Python Attack) చేసిన ఘటన జనగామ (Jangaon) జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాథ్ పల్లి మండలం, కంచనపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో పనిచేస్తున్న స్వప్న అనే మహిళపై కొండ చిలువ దాడి చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు మహిళను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పేషెంట్ తో పాటు 12 ఫీట్లు ఉన్న కొండ చిలువను సైతం ఆస్పత్రికి తీసుకెళ్లారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ కల్నెల్ మాచర్ల బిక్షపతి ఆమెకు వైద్యం చేశారు. ప్రస్తుతం స్వప్న ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని మాచర్ల బిక్షపతి తెలిపారు.

