కలం, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ (Telangana BJP)లో సంస్థాగతంగా ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మూడు జిల్లాల అధ్యక్షులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాం చందర్రావు ప్రకటించారు. కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులుగా సాయిమల్లేశం, యూ.రమేశ్, గిరివర్ధన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతమ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రాష్ట్రంలో పార్టీ పరంగా సంస్థాగత జిల్లాలు 38 నిర్ణయించగా.. గతంలోనే 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు.
వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డిని నియమించడాన్ని.. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనను సంప్రదించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించడంతోకొన్ని రోజులకు ఆ జిల్లా అధ్యక్షుడిని తొలగించారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య విబేధాలతో రెండు జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్‌లో ఉండింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో వికారాబాద్ తో కలిపి మూడు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను పార్టీ ప్రకటించారు.

