కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు నూతన అధ్యక్షుడిని నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆదేశాల మేరకు కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం (Sai Mallesham) ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

