టీమిండియాను కోహ్లీ, శాస్త్రీ మార్చేశారు: రహానే

కలం, స్పోర్ట్స్ :  టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో(Test Cricket) కొత్త ఆలోచనా విధానానికి నాంది పలికింది విరాట్ కోహ్లీ-రవిశాస్త్రీ జోడీ అని మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) అన్నారు. వారి హయాంలో భారత జట్టు దృక్పథం పూర్తిగా మారిపోయిందని రహానే పేర్కొన్నారు. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో ఎంఎస్ ధోనీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కోహ్లీ, కోచ్ రవిశాస్త్రీ కలిసి జట్టులో దూకుడు, ఆత్మవిశ్వాసాన్ని పెంచారని తెలిపారు. విదేశీ గడ్డపై కూడా గెలవగలమనే నమ్మకాన్ని కోహ్లీ-శాస్త్రీ జోడీ ఆటగాళ్లలో తీసుకొచ్చిందని రహానే చెప్పారు. గతంలో ఉన్న రక్షణాత్మక విధానానికి బదులుగా దూకుడుగా ఆడే సంస్కృతిని టీమిండియా అలవాటు చేసుకుందని అన్నారు.

ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, భయం లేకుండా తమ సహజ ఆట ఆడేలా కోహ్లీ ప్రోత్సహించారని రహానే తెలిపారు. కోహ్లీ-శాస్త్రీ హయాంలో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాలు సాధించడంతో పాటు, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే ప్రస్తుత భారత టెస్ట్ జట్టు పరిస్థితిపై రహానే ఆందోళన వ్యక్తం చేశారు. టెస్ట్ క్రికెట్‌లో సహనం, మానసిక బలం, పోరాట స్ఫూర్తి ఎంతో ముఖ్యమని అన్నారు. కఠినమైన పరిస్థితులలో ఎక్కువసేపు నిలబడగల ఆటగాళ్లే ఈ ఫార్మాట్‌లో విజయవంతం అవుతారని పేర్కొన్నారు. టెస్ట్ క్రికెట్‌కు ప్రత్యేకమైన మైండ్‌సెట్ అవసరమని, సవాళ్లను ఎదుర్కొనే మానసిక దృఢత్వమే ఆటగాళ్ల విజయానికి కీలకమని రహానే అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>