‘కలం’ కథనానికి రెవెన్యూ అధికారుల స్పందన.. బాధితుడి ఇంటికి వెళ్లి విచారణ!

​కలం, దమ్మ పేట: “కలం” మీడియాలో మంగళవారం వెలువడిన కథనానికి రెవెన్యూ అధికారులు వేగంగా స్పందించారు. బాధిత వ్యక్తి అయిన గండిపూడి వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్ తీసుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మ పేట (Dammapeta) తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ స్వయంగా వారి నివాసానికి వెళ్లారు.

అయితే అధికారులు వెళ్లే సమయానికి గండిపూడి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో, అక్కడే ఉన్న వారి కుమారుడిని అధికారులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా, బాధితుడి తరుఫున అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు అందించినట్లయితే, దానిపై తక్షణమే చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు ఆయన కుమారుడికి స్వయంగా హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం వేగంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా దళారుల రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్వే నెంబర్ 143లో ఉన్న తన అర ఎకరం వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పిస్తానంటూ రాము అనే దళారీ తన వద్ద రూ. 50,000 తీసుకుని మొహం చాటేశాడని.. ఇప్పుడు పని పూర్తి కావాలంటే మరో రూ. 50వేలు అడుగుతున్నాడని ముష్టిబండ గ్రామానికి చెందిన గండిపూడి వెంకటేశ్వరరావు అనే రైతు “కలం” మీడియాతో తన గోడును వెల్లబుచ్చుకున్నారు. తహసీల్దార్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. దీంతో అధికారులు స్పందించి తక్షణ చర్యలకు దిగారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>