యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు?

క‌లం, వెబ్‌డెస్క్‌: భారత్‌లో ఉచిత యూపీఐ చెల్లింపుల (UPI Payments) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. రూ.2,000కు పైబడిన కొన్ని యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టానికి సవరణలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని, ఇందుకు అవసరమైన చట్టపరమైన వెసులుబాటును మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సవరణల ప్రకారం, భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించవచ్చు.

ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. అయితే ఈ ఛార్జీలు ఏడాదికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలకే వర్తించే అవకాశముంది. వినియోగదారులు అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని, చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపు కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>