కలం, వెబ్ డెస్క్ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) అల్టిమేటంకు అటవీ అధికారులు దిగివచ్చారు. ఇంధన్‌పల్లి (Indhanpally) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను కాళేశ్వరం జోన్ సీసీఎప్ ప్రభాకర్ జారీ చేశారు. ఈ సందర్భంగా జన్నారంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందన్ పల్లి ఎఫ్ఆర్ఓ ఓ. లక్ష్మి నారాయణను సస్పెండ్ చేశారని ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే అమాయకులపై వేధింపులు అపాలని డిమాండ్ చేశారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా అటవీ అధికారుల్లో మార్పులు రావాలన్నారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో లక్ష్మీనారాయణ గిరిజనులను దుర్భాషలాడుతూ.. లాఠీతో కొట్టడం వివాదాస్పదమయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ దాడిలో పట్టుకున్న ట్రాక్టర్లను వదిలిపెట్టాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అంతేకాదు అదేవిధంగా కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్‌డీపీఓ శాంతారాంను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరారు.
Also Read : ప్రజావాణిలో నిర్లక్ష్యం.. పెండింగ్‌లో 50 శాతానికి పైగా అప్లికేషన్లు
Follow Us On : WhatsApp

