మెగా డీఎస్సీ పిల్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ – 2025 (AP Mega DSC) నియామక ప్రక్రియపై వైసీపీ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం( పిల్) పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెగా డీఎస్సీపై విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రదేశకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

విచారణ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో నిజంగానే నష్టపోయిన అభ్యర్థులు ఉంటే.. వారు నేరుగా కోర్టును ఆశ్రయించడం లేదని ప్రశ్నించింది. బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారనే వాదనతో తాము ఏకిభవించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది అత్యంత విలువైన సాధనమని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దానిని దుర్వినియోగం చేయొద్దని హితవు పలికింది. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>